మంత్రి కేటీఆర్‌పై ఏపీ నేత సంచలన వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సవాల్ విసిరారు. తనతో చర్చకు కూర్చుంటే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తానని అన్నారు.

Update: 2022-12-27 10:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌కు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సవాల్ విసిరారు. తనతో చర్చకు కూర్చుంటే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తానని అన్నారు. తనతో చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్‌ది నోరా తాటిమట్టా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాలు అబద్దాలమయంగా మార్చేశారని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీల పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అబద్దాలు రాజ్యమేలుతున్నాయని, కుటుంబ పార్టీలు బలోపేతం కావడానికి రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ సర్కార్ ఏం చేసిందో తనతో చర్చకు కూర్చుంటే వాయించేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌వి అన్ని అబద్ధాలేనని దుయ్యబట్టారు. 

Tags:    

Similar News