బీఆర్‌ఎస్‌ నేతల చేరికతో కొంత ఇబ్బంది వాస్తవమే: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ(congress party) అధికారంలోకి వచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ(BRS) నుంచి చేరికలు జరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-10-24 13:24 GMT

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ(congress party) అధికారంలోకి వచ్చింది. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ(BRS) నుంచి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పాత, కొత్త నేతలతో పార్టీలో విబేధాలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో గంగారెడ్డి హత్య(Gangareddy murder)తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan reddy) బహిరంగంగానే సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు హత్యలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. కాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌(TPCC chief Mahesh Kumar) స్పందించారు. ఇప్పటికే తాను జీవన్ రెడ్డి తో రెండు పర్యాయాలు ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగారెడ్డిని బీఆర్‌ఎస్‌ నేతలే చంపారని.. జీవన్‌రెడ్డి అనుకుంటున్నారు. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణం. సోషల్ మీడియాలో విష ప్రచారంతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్‌కు మద్దతుగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారు. గత కొద్ది రోజులుగా.. బీఆర్‌ఎస్‌ నేతల చేరికతో కొంత ఇబ్బంది వాస్తవం ఉందని, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ (TPCC chief Mahesh Kumar) చెప్పుకొచ్చారు.


Similar News