ఎఫ్‌జీవీ రిఫైనరీ పరిశ్రమను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

ఎఫ్‌జీవీ కంపెనీ నిర్వహిస్తున్న రిఫైనరీ కర్మాగారాన్ని మలేషియా పర్యటనలో భాగంగా గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సందర్శించారు. తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.

Update: 2024-10-24 15:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎఫ్‌జీవీ కంపెనీ నిర్వహిస్తున్న రిఫైనరీ కర్మాగారాన్ని మలేషియా పర్యటనలో భాగంగా గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సందర్శించారు. తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్ గార్డెను, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్దతులతో నడుపబడుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. ఎఫ్‌జీవీ కంపెనీ నుంచి తెలంగాణ కు ఇప్పటికే సీడ్లింగ్స్ ను చాలా వరకు తెప్పించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోనే స్వతహాగా సీడ్ గార్డెన్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దానికి ఎఫ్ జీవీ కంపెనీ సహాయ సహకారాలు అందజేయాలని మంత్రి కోరారు. దానికి కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రిఫైనింగ్ సమయంలో కంపెనీ తీసుకునే జాగ్రత్తలు, వివిధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ను వివరించారు. అనంతరం పామాయిల్ తోటలను పరిశీలించారు. పామ్ ఆయిల్ రిసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించి పలు అంశాలను సేకరించారు.


Similar News