అంబేద్కర్ విగ్రహావిష్కరణపై ‘సోషల్ వార్’!

హుస్సేస్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ప్రారంభించాలని

Update: 2023-04-04 13:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హుస్సేస్ సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. విగ్రహ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మేరకు కళాకారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. అయితే తెలంగాణకే మణిహారంగా నిలవబోతున్న ఈ విగ్రహం ప్రారంభోత్సవం విషయంలో సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఈ విగ్రహాన్ని ప్రభుత్వం ఏ రకంగా ప్రారంభించబోతోందనే ప్రశ్నలుపై నెటిజన్లు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.

దీంతో విగ్రహం ప్రారంభోత్సవం విషయంలో బీఆర్ఎస్ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య సోషల్ మీడియాలో జోరుగా వాదనలు జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అద్భుతం కానీ ఆరంభం సకల మతాల మంత్రాలతో ప్రారంభిస్తారా? లేక రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా భారత రాజ్యాంగ పీఠికతో ప్రారంభిస్తారా అనే ప్రస్నలను సంధిస్తున్నారు. విగ్రహావిష్కరణలో వైదిక తంతులు అసలు వద్దని కొందరు అంటుంటే. బౌద్ధ పద్దతిలో పంచశీల జెండా ఆవిష్కరించి, బుద్ధ వందనంతో ప్రారంభించాలని మరి కొందరు చెబుతున్నారు. వైదిక తంతులను వ్యతిరేకించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ అదే వైదిక తంతుతో జరిగితే ఆ మహనీయుడిని అవమానించినట్టే అవుతుందని మరి కొందరు వాదిస్తున్నారు. అబేంద్కర్ స్వయంగా బౌద్ధమతాన్ని అవలంభించినందున బౌద్ద పద్దతిలోనే ప్రారంభిస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని చెబుతున్నారు. ఈ వాదనపై కొంత మంది నెటిజన్ల మధ్య ఫైట్ జోరుగా సాగుతోంది. పొలిటికల్ రియాలిటీ గురించి ఓనమాల రాని వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతారని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే. బౌద్ధం ప్రకారం విగ్రహావిష్కరణ చేస్తే అంబేద్కర్ ను ఎలాగైతే హిందూ వ్యతిరేక ముద్ర వేశారో కేసీఆర్ పై కూడా అలానే హిందూవ్యతిరేక ముద్ర వేసి ఆ క్రెటిడ్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మరి కొందరు మండిపడుతున్నారు. ఇక మరి కొందరేమో అంబేద్కర్ విగ్రహావిష్కరణ వైదికం, బౌద్ధం రెండింటి ప్రకారం జరుగుతుంది తప్ప వైదికం అసలే వద్దు అంటే అది మీ మూర్ఖత్వమే అవుతుందని ఎదురు దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పై సోషల్ మీడియాలో భిన్న వాదనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News