గాంధీభవన్‌లో సోషల్ మీడియా ట్రైనింగ్

బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని ఏఐసీసీ సోషల్ మీడియా ఇంచార్జి సుప్రియ శ్రీనేట్ పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్ లో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్​ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా ట్రైనింగ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Update: 2024-10-24 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని ఏఐసీసీ సోషల్ మీడియా ఇంచార్జి సుప్రియ శ్రీనేట్ పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్ లో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్​ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా ట్రైనింగ్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ..ప్రతిపక్షం పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు. దీన్ని నిలదీయాలన్నారు. హ్యాండిల్స్ గుర్తించి కేసులు పెట్టాలన్నారు. లీగల్ సెల్ తో ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ అవ్వాలని సూచించారు. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా లో కాంగ్రెస్‌కు ఎదురైన ఇబ్బందులు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే మార్గాలపై వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందరికీ తెలియజేయాలని పిలుపు నిచ్చారు. పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..సోషల్ మీడియా అనేది అన్నీ రాజకీయ పార్టీలకు కీలకంగా మారిందన్నారు. మంచిగా ప్రచారం చేయాలని తపించినా, చెడుగా ప్రచారం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల ద్వారానే 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

గత పదేళ్లుగా బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తూ వస్తుందన్నారు.. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి కోట్ల రూపాయలు దోచుకుని సోషల్ మీడియా కు ఖర్చు పెడుతున్నారని వివరించారు. టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్​కుమార్ మాట్లాడుతూ.కొత్త సాంకేతికతలను ఉపయోగించి, తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా సోషల్ మీడియా ను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తలను గుర్తింపును ఇవ్వాలని కోరారు. ప్రతి పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్తలకు స్మార్ట్ కార్డ్ జారీ చేయడం ద్వారా హెల్త్ ఇన్షూరెన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ పొందవచ్చని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం అందుకోవడంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. భవిష్యత్ లో పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ ప్రతిష్ట పెంచుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షి, గుత్తా అమిత్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News