కాలుతున్న డంప్ యార్డు.. నగరంలో కమ్ముకొచ్చిన పొగ

కరీంనగర్ నగరపాలక సంస్థ అసమర్థతతో నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది.

Update: 2024-04-10 08:53 GMT

దిశ, బ్యూరో కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ అసమర్థతతో నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. కరీంనగర్‌కు ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్‌లో తరచు అగ్ని రాజుకోవడంతో నిత్యం దాని నుంచి వెలువడుతున్న పోగతో కరీంనగర్ కమ్ముకుంటుంది. తాజాగా ఆదివారం రాత్రి డంప్ యార్డులో అగ్గి రాజుకుని మంటలు చెలరేగాయి. డంప్ యార్డ్ మొత్తం మంటలు అంటుకుని చెలరేగడంతో దట్టమైన పొగ వెలువడుతుంది.

డంప్ యార్డు మంటల నుంచి నుంచి వెలువడుతున్న పొగతో సమీప ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెల్లవారేసరికల్లా నగరం అంత పొగ విస్తరించి నగర ప్రజలు అవస్థలు పడ్డారు. మానేరు బొడ్డున ఉన్న డంప్ యార్డ్ బైపాస్ రోడ్డును ఆనుకొని ఉండడంతో పెద్దపల్లి బైపాస్‌పై వెళ్లే ప్రయాణికులకు రోడ్డు కనబడకుండా పొగ కమ్మేసింది. నగరపాలక సంస్థ సిబ్బంది ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లు వాటర్ ట్యాంకర్ల సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.


Similar News