వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి..
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన వరంగల్
దిశ, హనుమకొండ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన వరంగల్ జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. వరంగల్ కు మంజూరైన సైనిక్ స్కూల్ పనులు ప్రారంభించాలని గతంలో ఢిల్లీలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి లేఖను అందజేసినట్లు తెలియజేశారు. సైనిక్ స్కూల్ పాత పద్ధతిలోనే పనులు ప్రారంభించాలని కోరారు. కేంద్రం నుంచి ప్రధానమంత్రి మిత్రా ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.