రోజురోజుకూ పెరుగుతున్న స్మితా సబర్వాల్ అందం.. హీరోయిన్ కాదంటే ఎవరైనా నమ్ముతారా?

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను తెలంగాణ సీఎంవో నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-04-07 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను తెలంగాణ సీఎంవో నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈమెను నీటిపారుదల శాఖ కార్యదర్శి పోస్టు నుంచి బదిలీ చేశారు. సీఎంవోలోకి సీనియర్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డిని తీసుకోగా.. నీటి పారుదల శాఖ కార్యదర్శిగా మరో సీనియర్ అధికారి రాహూల్ బొజ్జాను నియమించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్‌గా స్పెషల్ గుర్తింపు దక్కించుకున్న స్మితా సబర్వాల్ తాజాగా సమ్మర్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో స్మితా సబర్వాల్ ట్రెండీ వేర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు స్మిత ‘సమ్మర్ వచ్చేసింది. అందరికీ హ్యాపీ సండే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రీసెంట్ గా స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ ఖాతా యానివర్సరీ సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈమె పోస్ట్‌కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హీరోయిన్ల కంటే మీరే ఎక్కువ అందంగా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.

Full View


Similar News