ఆ చల్లని పని చేసేశా.. స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

రెండు నెలలుగా జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది ఘట్టానికి చేరుకుంది.

Update: 2024-05-13 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు నెలలుగా జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది ఘట్టానికి చేరుకుంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. అయితే ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, పొంగులేటి, హీరోలు అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ సహా పలువరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరొందిన స్మితా సబర్వాల్ సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె పంచుకున్నారు. వేలికి సిరాచుక్క ఉన్న తన ఫొటోను షేర్ చేసిన స్మితా సబర్వాల్ ‘ఈ చల్లటి రోజు చల్లటి పని చేశాను..’ అని రాసుకొచ్చారు. 


Similar News