మీరు చూడాలనుకునే మార్పు మీరే కావచ్చు.. స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్

కరీంనగర్ కలెక్టర్‌గా, తర్వాత సీఎంవో కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక గుర్తింపు పొందారు.

Update: 2024-07-18 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ కలెక్టర్‌గా, తర్వాత సీఎంవో కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శిగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన ఐఏఎస్ టాపర్ అనన్యరెడ్డిని ఇంట్రడ్యూస్ చేస్తూ స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అనన్యారెడ్డి నా తొలిరోజుల ఆదర్శవాదాన్ని మళ్లీ గుర్తు చేసిందని రాసుకొచ్చారు. ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు మీరే కావచ్చు అంటూ ట్వీట్‌కు కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా అనన్యారెడ్డికి స్మితా సబర్వాల్ నికోల్ మిచియవెల్లి రాసిన ‘ది ప్రిన్స్’ పుస్తకాన్ని అందజేశారు.


Similar News