దివ్యాంగుల పట్ల స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన డిమాండ్

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత అగర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

Update: 2024-07-23 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత అగర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తాజా కామెంట్స్ దివ్యాంగుల మనోభావాలను, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవని ఇవి సభ్య సమాజానికి మంచివి కాదన్నారు. సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని ప్రధాని మోడీ 2016లో వికలాంగుల అనే పదాన్ని తీసేసి దివ్యాంగులు అనే పదానికి చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. దీంతో దివ్యాంగులు అనే పదం వారి మనోబలాన్ని పెంచిందని తెలిపారు.

దివ్యాంగులు భారత సమాజంలో అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా దివ్యాంగులు తమ ప్రతిభను మేధస్సును ఉపయోగించి ఎన్నో దేశ ప్రయోజనకరమైనటువంటి సంబంధాల్లో భాగం పంచుకున్నారని గుర్తుచేశారు. దివ్యాంగుల పట్ల శ్రీమతి స్మిత అగర్వాల్ చేస్తున్న ట్వీట్ పట్ల సభ్య సమాజం ఆందోళనతో ఉన్నదని.. వెంటనే ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయంపై స్పందించి ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.

Tags:    

Similar News