మేడారంలో రేవంత్ రెడ్డి, సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు (వీడియో)
శుక్రవారం వనదేవతల దర్శనానికి గవర్నర్, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు వీఐపీలు దర్శనానికి పోటెత్తారు.
దిశ, మేడారం బృందం : శుక్రవారం వనదేవతల దర్శనానికి గవర్నర్, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు వీఐపీలు దర్శనానికి పోటెత్తారు. దీంతో పోలీసులు సాదారణ భక్తుల క్యూలైన్ దర్శనాలు నిలివేశారు. కాగా మేడారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో కోపోద్రిక్తులైన భక్తులు పోలీసులపై తిరగబడ్డారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అక్కడే ఉన్న జర్నలిస్టులు కవరేజ్ చేయడానికి వెళ్లగా పోలీసులు మీడియాను సైతం లెక్క చేయకుండా తోసేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మంత్రి అక్కడకు చేరుకుని భక్తులను, జర్నలిస్టులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టారు. ౌ