SLBC టన్నెల్‌లో ఇదీ పరిస్థితి.. ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ (వీడియో)
నాగర్ కర్నూలు(Nagar Kurnool)లోని దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది ప్రాణాల కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు(Nagar Kurnool)లోని దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది ప్రాణాల కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారంతా సురక్షితంగా తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్(Tunnel)లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు(NDRF Teams) వెళ్లాయి. రెండు వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోవడంతో వెనుదిరిగారు. లోపలి పరిస్థితిని ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించుకొచ్చారు. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నా్యి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేమని అక్కడున్న మంత్రులు ఉత్తమ్ కమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు వివరించారు.