TSPSC పేపర్ల లీక్ కేసులో ట్విస్ట్.. పేపర్ కొట్టేసిందే అతడి కోసమే!

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరింత దూకుడు పెంచింది.

Update: 2023-03-29 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరింత దూకుడు పెంచింది. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ ఐదుగురికే చేరినట్లు దర్యాప్తులో భాగంగా సిట్ ఆధారాలు సేకరించింది. గ్రూప్ 1 పరీక్ష రాసిన 84 మంది అనుమానితులను విచారించినట్లు సిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ గ్రూప్- 1 పేపర్ తన కోసమే దొంగలించినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. పేపర్ దొంగలించిన ప్రవీణ్.. దానిని మరో ముగ్గురికి ఇచ్చినట్లు అధికారులు అనుమానపడుతున్నారు. ఇక, అసిస్టెంట్ ఇంజనీరింగ్ (ఏఈ) పేపర్.. పరీక్షకు ముందే 12 మందికి చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అందులో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు. డాక్యా, రాజేందర్ కలిసి ఏఈ పేపర్ విక్రయించారని తెలిపారు. 

Tags:    

Similar News