శిరీష మర్డర్ కేసు : పోలీసుల కీలక నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని శిరీష మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శిరీష మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. రాత్రి పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. తాజాగా హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రీపోస్టు మార్టం చేయాలని పోలీసులు కుటుంబసభ్యులకు తెలిపారు. శిరీష మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. శిరీష కళ్లపై స్క్రూ డ్రైవర్ తో దాడి చేసినట్లు తెలిపారు. నరాలను బ్లేడుతో కోసి కిరాతకంగా హత్య చేశారన్నారు.
శిరీష హత్యకు కొద్ది గంటల ముందు ఇంట్లో గొడవ జరిగిందన్నారు. ఆమెను బావ అనిల్ దారుణంగా హత్య చేశాడు. అర్ధరాత్రి కలుద్దాం అంటూ శిరీషను బయటకు పిలిచిన అనిల్ ఆమెను హత్య చేశాడు. పరిగి మండలం కాడ్లాపూర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే శిరీషపై హత్యకు ముందు అత్యాచారం జరిగిందనే అనుమానంతో పోలీసులు రీ పోస్టు మార్టం చేయాలని నిర్ణయించారు.
Also Read: Apsara Murder Case: వెలుగులోకి షాకింగ్ విషయాలు