ఒకే భవనం.. 4 శంకుస్థాపనలు
హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్‌కు కేసీఆర్ 2014 డిసెంబర్ 24న మహేంద్ర హిల్స్‌లో శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అన్నట్టుగానే 2014 డిసెంబర్ 24న మహేంద్ర హిల్స్‌లో శంకుస్థాపన చేశారు.. అక్కడ రెండెకరాల భూమి కూడా కేటాయించారు. సీన్ కట్ చేస్తే.. 2017 డిసెంబర్ 4న యాప్రాల్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి మరో మారు అప్పటి మైనార్టీ శాఖ మంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. అక్కడా పనులు షురూ కాలేదు.. 2019 డిసెంబర్ 18న మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోకాపేటలో క్రిస్టియన్ భవన్‌కు శంకుస్థాపన చేశారు. ఆ స్థలమూ వివాదంలో ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్ 12న మరో మారు ఉప్పల్ భగాయత్‌లో క్రిస్టియన్ భవన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ నాలుగు శంకు స్థాపనలూ కేవలం ఒక్క భవన్ నిర్మాణం కోసమే! స్థలానికి సంబంధించిన వివరాలేవీ తెలుసుకోకుండానే పునాది రాయివేయడం అనేక విమర్శలకు తావిస్తున్నది. క్రిస్మస్ పండుగ వచ్చే డిసెంబర్ నెలలోనే ఈ నాలుగు శంకుస్థాపనలూ చేయడం మరో విశేషం.
తేదీ స్థలం శంకుస్థాపన చేసింది
డిసెంబర్ 24, 2014 మహేంద్ర హిల్స్ ముఖ్యమంత్రి కేసీఆర్
డిసెంబర్ 4, 2017 యాప్రాల్ మైనార్టీ సంక్షేమ మంత్రి మహమూద్ అలీ
డిసెంబర్ 18, 2019 కోకాపేట మైనార్టీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్
డిసెంబర్ 12, 2022 ఉప్పల్ భగాయత్ మైనార్టీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్
Also Read...