జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో నాగర్ కర్నూల్ జిల్లాకు రజతం..
జాతీయ స్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారిని చుక్క శైలజ అండర్ 16 విభాగంలో రజత పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జాతీయ స్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారిని చుక్క శైలజ అండర్ 16 విభాగంలో రజత పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10, 11,12 తేదీలలో బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరుగుతున్న 18వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి అండర్ 16 విభాగంలో 80 మీటర్ల పరుగు పందాన్ని 10.43 సెకండ్లలో పూర్తిచేసిన శైలజ రజత (సిల్వర్ ) పతకం సాధించినట్లు ఆయన తెలిపారు.
పసుపుల పరశురాముడు పర్యవేక్షణలో శైలజ శిక్షణ పొందింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని, ఈ పతకం సాధించడం పట్ల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజేందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు లక్ష్మీ, బిక్షపతి యాదవ్, జాయింట్ సెక్రటరీ పరుశురాముడు, కోశాధికారి విజయ్, అసోసియేషన్ సభ్యులు హర్ష వ్యక్తం చేశారు.