కెమికల్స్‌తో స్వీట్స్.. ఎమరాల్డ్‌ స్వీట్‌ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు

ఎమరాల్డ్‌ స్వీట్‌ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

Update: 2024-07-11 13:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్స్ తయారీలో పెద్ద ఎత్తున కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించారు. సరైన లేబుల్స్‌ లేని ముడిసరుకులతోపాటు, కిచెన్ ఏరియా అపరిశుభ్రంగా ఉందని గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కెమికల్స్‌తో కూడిన రంగులు కలిసిన 60 కిలోల బెల్లం, నాణ్యత లేని 3 కిలోల జీడిపప్పు సీజ్‌ చేశారు.

Tags:    

Similar News