బీఆర్ఎస్ కు షాక్.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాగ్రెస్ లో చేరిన 'సీఎంఆర్’
ఎంపీ ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.
దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ నుంచి వలసలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే పలవురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలో చేరిపోగా తాజాగా కేసీఆర్ కు అత్యంత సన్నిహింతుడిగా పేరున్న మరో కీలక నేత జంప్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టీ దేవేందర్ రెడ్డి పార్టీ మారారు. మంగళవారం ఆయన తన సతీమణి చిట్టి మాధూరి రెడ్డి (సీఎంఆర్) తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చిట్టీ దేవేందర్ రెడ్డి రెండవసారి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన సతీమణి మాధురి రెడ్డి కొండపాక తాజా మాజీ సర్పంచ్ గా వ్యవహరించారు. అంతకు ముందు దేవేందర్ రెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహా తో భేటీ అయితే పార్టీలో చేరే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం కండువా కప్పుకున్నారు. కాగా వీరి చేరికను కాంగ్రెస్ శ్రేణులు స్వాగతిస్తుంటే.. పదవులిచ్చి ఆదుకున్న కేసీఆర్ కు ద్రోహం చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Click here for Twitter Link : https://twitter.com/Raj_KCR_Bakthud/status/౧౭౮౨౭౪౨౬౮౦౦౯౬౮౬౬౪౯౧
Read More...