Delhi Liquor Case: అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్ తగిలింది. అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. పిళ్లైకి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్ తగిలింది. అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. పిళ్లైకి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిళ్లై ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీలోని ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపిస్తుంది. ఇక మరోవైపు, విజయ్ నాయర్ ఢీఫాల్ట్ బెయిల్‌పై నేడు కోర్టు విచారణ జరిపింది. బెయిల్‌పై ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది. రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 15కు వాయిదా వేసింది.
See More...