TSPSC ఆఫీస్ ముట్టడికి షర్మిల యత్నం.. ఉద్రిక్తత
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేపిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శుక్రవారం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు ఆందోళన బాట పట్టారు. టీఎస్పీఎస్సీ కార్యాయలం ముట్టడికి యత్నించారు. దీంతో టీఎస్సీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా కార్యకర్తలను అడ్డుకుని షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను లోటస్ పాండ్ తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.
షర్మిల స్పందిస్తూ పేపర్ లీక్ కేసులో పెద్దోళ్లను తప్పిస్తున్నారని ఆరోపించారు. చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆందోళనలు అనగానే ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయిస్తుందన్నారు. తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తాను క్రిమినల్ నా అని ప్రశ్నించారు.