షర్మిల, శంకర్ నాయక్ బహిరంగంగా క్షమాపణ చెప్పండి: ట్రాన్స్ జెండర్స్
ఇటీవల వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరస్పర విమర్శలలో కొజ్జా (ట్రాన్స్ జెండర్స్) అని వాడటం, తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఇరువురు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేశారు.
దిశ, అంబర్ పేట్: ఇటీవల వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరస్పర విమర్శలలో కొజ్జా (ట్రాన్స్ జెండర్స్) అని వాడటం, తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఇరువురు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేశారు. బుధవారం ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాన్స్ జెండర్స్ మాట్లాడారు. 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ట్రాన్స్ జెండర్స్ వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్దికోసం తమ మనోభావాలను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
ప్రేమ జ్యోతి ఫౌండేషన్ అధ్యక్షురాలు అవంతిక మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గరవుతున్న తరుణంలో ప్రజా ప్రతినిధులు తమను కించపరచడం సరైనది కాదన్నారు. ట్రాన్స్ జెండర్స్ సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగులో పూర్తిగా కొజ్జా పదాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా కొజ్జా పదాన్ని వాడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు కృష్ణమ్మ, జాస్మిన్, విష్ణు తేజ తదితరులు పాల్గొన్నారు.
Also Read..