పచ్చదనం పర్యావరణ హితం : శంభీపూర్ రాజు

పచ్చదనం పర్యావరణ హితమని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటి వాటిని సంరక్షించాలని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లాఅధ్యక్షుడు, ఎమ్యెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.

Update: 2024-07-24 06:51 GMT

దిశ, దుండిగల్ : పచ్చదనం పర్యావరణ హితమని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటి వాటిని సంరక్షించాలని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లాఅధ్యక్షుడు, ఎమ్యెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టున రోజు సందర్భంగా స్థానిక నేతలతో కలిసి ఆయన కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన రాజు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్‌లో మరిన్ని పదవులు అలంకరించాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జిల్లా పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలువునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జీతయ్య, ప్రదీప్, సుధాకర్ రెడ్డి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News