మరో 5 నెలల్లో BRS భూస్థాపితం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో

Update: 2024-05-14 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో 5 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా పని చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తన కూతురు కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీజేపీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగా.. షబ్బీర్ అలీ మాత్రం 11 సీట్లులో విజయం సాధిస్తుందని చెప్పడం గమనార్హం.


Similar News