ఇక ప్రైవేట్ విమానాలకు ప్రత్యేక టర్మినళ్ళు

ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్.

Update: 2024-09-02 11:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వారికోసం ఓ వెసులుబాటు తీసుకువచ్చింది. ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించే వినియోగదారులకు ప్రత్యేక టెర్మినళ్ళను సోమవారం ప్రారంభించింది. ఇకపై ప్రైవేట్ విమానాలను ఉపయోగించే ప్రయాణికులు సాధారణ ప్రయాణికుల టెర్మినళ్లలో రద్దీని భరించడం తప్పుతుంది. వ్యాపార నిమిత్తం లేదా వ్యక్తిగత ప్రయాణాలకు వారి స్వంత ఛార్టర్ విమానాలను వినియోగించుకునేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, వారి ప్రయాణం మరింత సులభం అవుతుందని విమనాశ్రయ అధికారులు తెలిపారు. ఈ టెర్మినల్ లో అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక టెక్నాలజీ ఉంటుందని పేర్కొన్నారు. 


Similar News