దిశ, వెబ్ డెస్క్: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనుమతిస్తే త్వరలో ఏపీలో పర్యటిస్తా అన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. షర్మిలపై దాడికి సంబంధించి సజ్జల చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ వ్యాఖ్యలుగానే చూస్తామన్నారు. షర్మిల సవాలును స్వీకరిస్తున్నానన్నారు. తన ఆస్తులపై చర్చకు సిద్ధమన్నారు. నర్సంపేటలో తేల్చుకుందామని షర్మిలకు సవాల్ విసిరారు. షర్మిల వెనకున్న శక్తులు ఎవరో వరుస ఘటనలతో తేలిపోయిందన్నారు. కేసీఆర్ను తిడుతుంటే స్పందించని గవర్నర్ షర్మిల విషయంలో అతిగా స్పందిస్తున్నారన్నారు. కాగా ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుడు తొండ ముదిరి ఊసరవెల్లిలా మారి కబ్జాకోరయ్యాడని ధ్వజమెత్తారు. పేరుకే పెద్ది సుదర్శన్ రెడ్డి అని మనిషిది చిన్న బుద్ధి అన్నారు. నర్సంపేటకు ఇద్దరు ఎమ్మెల్యేలని సుదర్శన్ రెడ్డి భార్య ఎమ్మెల్యేగా చలామణి అవుతూ డబ్బులు దండుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.
Also Read......