సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కోవర్ట్.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-08-11 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య బంధం రోజు రోజుకూ బలపడుతోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ కోవర్టులా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాదని.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


అందుకే తరచూ రేవంత్ రెడ్డిప పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా.. నష్టం ఎక్కువ జరుగుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా విపక్షాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ కాలం గడుపుతోందని అన్నారు. రాజకీయాలు చేయడం, ఫిరాయింపులకు ప్రొత్సహించడం మానేసి సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలకు హితవు పలికారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..