ట్యాపింగ్ కేసులో సంచలనం.. పోలీసులను ఫాలో అవుతున్న ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-06-20 08:17 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ కేసులో ఏ చిన్న వ్యవహారమైనా సెన్సేషనల్ గా మారుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం మరోసారి మ్యాన్ డేట్ బెయిల్‌ను దరఖాస్తు చేసుకున్నారు. అయితే మంగళారం రోజు నాంపల్లి కోర్టు పోలీసులు దాఖలు చేసిన చార్జీషీటులో కొన్ని పొరపాట్లు గుర్తించి దానిని వెనక్కి పంపించింది. దీంతో చార్జీషీటును కోర్టు పరిగణలోకి తీసుకోలేక పోయింది. వెంటనే ప్రభాకర్ రావు మ్యాన్ డేట్ బెయిల్‌ను దాఖలు చేశారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు తిరిగి పొరపాట్లను సరిదిద్దుకుని చార్జీషీటును బుధవారం తిరిగి దాఖలు చేసేశారు.

ఇలా ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ బెయిల్ పొందేందుకు పోలీసుల మూవ్‌మెంట్‌లను నిరంతరం ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావును అరెస్టు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను సంపాదించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. పోలీసులు తిరిగి చార్జీషీటును దాఖలు చేయడంతో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా లేదా రిజెక్ట్ అవుతుందా ఇప్పుడు కోర్టు తేల్చాల్సి ఉంది. ఈ బెయిల్‌పై వాదనాలు గురువారం నాంపల్లి కోర్టులో జరిగి బెయిల్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.


Similar News