కాసేపట్లో టీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. రెండు చోట్ల నుంచి సీనియర్లు పోటీ.?.

టీ కాంగ్రెస్ రెండో జాబితా కాసేపట్లో విడుదల కానుండగా.. ఆశావాహులందరూ

Update: 2023-10-27 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ కాంగ్రెస్ రెండో జాబితా కాసేపట్లో విడుదల కానుండగా.. ఆశావాహులందరూ టెన్షన్‌లో ఉన్నారు. సెకండ్ లిస్ట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు టికెట్ వస్తుందా...? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. అయితే రెండో జాబితాలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. పలువురు సీనియర్ నేతలు రెండు చోట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు రేవంత్ రెడ్డితో పాటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పేర్లు మరో నియోజకవర్గం నుంచి కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డికి కొడంగల్ నుంచి సీటు కన్ఫామ్ అవ్వగా.. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేయనున్నారని సమాచారం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సిరిసిల్ల నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిద్దిపేట నుంచి పోటీ చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ ఆదేశిస్తే గజ్వేల్ నుంచి కూడా పోటీలోకి దిగుతానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. నేడు ప్రకటించనున్న రెండో జాబితాతో క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..