దళితులను మళ్ళీ మోసం చేస్తున్న కేసీఆర్.. ఇందిరా శోభన్

కేసీఆర్ దళితులను మళ్ళీ మోసం చేస్తున్నారని సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ విమర్శించారు.

Update: 2023-04-14 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ దళితులను మళ్ళీ మోసం చేస్తున్నారని సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ విమర్శించారు. శుక్రవారం అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మాట్లాడుతూ దళిత ముఖ్యమంత్రి అని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మోసం చేశారన్నారు. రాజ్యాంగం ప్రకారం దళితులకు 17 శాతం నిధులు ఇవ్వాల్సి ఉండగా సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయని ముఖ్యమంత్రి బడ్జెట్ కేటాయింపులే విడుదలకు నోచుకోలేదన్నారు. ఇవాళ అన్ని పేపర్లలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు కుమ్మరించరన్నారు. దళితులకు సబ్ ప్లాన్ నిధులను 1,13,192 కోట్లు ఖర్చు చేశామని పారిశ్రామికవేత్తలకు 15% రిజర్వేషన్ కల్పించామని, చేసిన ప్రకటనలు ఎక్కడ ఖర్చు పెట్టారో ఏ దళితుల బతుకులు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

నేను ఆర్టీఐలో అడిగితే బడ్జెట్ అలగేషన్లు ఇచ్చారు, కానీ విడుదల చేసిన నిధులు ఇవ్వలేదన్నారు. దళితుల ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. ఒక కంపెనీ తన వస్తువు అమ్ముకోవడానికి బ్రోచర్ తయారు చేసినట్టుగానే సీఎం కేసీఆర్ పొలిటికల్ బ్రోచర్ తయారు చేశారని ఎద్దేవా చేశారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లు చేయలేకపోయారు కానీ లేజర్ షో తోటి ప్రజలను దోచుకోవడానికి గ్రాఫిక్ డిజైన్ బ్రోచర్ రాబోతుందన్నారు. ఇక హైదరాబాద్ అంటే చార్మినార్ కాదని కేసీఆర్ కట్టిన కట్టడాలు అని చెప్పుకోనికే అన్నారు. అందుకే ఆ మాయలో పడవద్దన్నారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు విలువలు కాపాడాలని మన బతుకులు మనమే మార్చుకుందామన్నారు. దళిత బంధు పేరుతో నడుస్తున్న స్కీమ్ పూర్తిగా పక్కదారి పడుతుందన్నారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అబద్దాలతో ఎన్ని రోజులు పాలనను కొనసాగిస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News