HYD: గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి

సీనియర్ పాత్రికేయులు దత్తాత్రేయ మృతిచెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం దత్తాత్రేయ తుదిశ్వాస వదిలారు.

Update: 2023-10-03 07:27 GMT

దిశ, సిటీ బ్యూరో: సీనియర్ పాత్రికేయులు దత్తాత్రేయ మృతిచెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం దత్తాత్రేయ తుదిశ్వాస వదిలారు. మూడు దశాబ్దాలుగా ఈనాడు దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న దత్తాత్రేయ మృతి సమాచారం తెలుసుకొని హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ సమీపంలోని ఆయన నివాసానికి భారీగా జర్నలిస్టు చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. బుధవారం ఆయన పార్దివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు యూనియన్‌లు సంతాపాన్ని ప్రకటించాయి. దత్తాత్రేయకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రష్యాలో విద్యాభ్యాసంలో ఉన్నందున ఆమె వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News