కాంగ్రెస్ సభలు పెట్టుకుంటే బీజేపీకి ఎందుకంత భయం: వీహెచ్
హైదరాబాద్లో కుక్కల దాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్లో కుక్కల దాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలను నియంత్రించకపోతే చిన్న పిల్లలపై మరిన్నీ దాడులు పెరుగుతాయని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఛత్తీస్ గఢ్లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు పెట్టుకుంటోందనే అక్కసుతోనే ఆ రాష్ట్ర సీఎం భూపేష్ భాగేల్ సోదరుడికి ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
కాంగ్రెస్ సభలు పెట్టుకుంటే బీజేపీకి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నేతలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనుక అమిత్ షా ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా మార్చి 22 నుంచి 25 వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read..
రైతు రుణమాఫీ CM కేసీఆర్ మరో ఎన్నికల స్టంట్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి