VH: ఆ సామాజికవర్గం ఓట్లతోనే కాంగ్రెస్‌కు అధికారం

కుల గణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

Update: 2024-10-14 13:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కుల గణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మాట ప్రకారం అసెంబ్లీలో కుల గణన అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని, దీన్ని స్పీడ్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ పవర్‌లోకి రావడానికి బీసీలే కారణమని, వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు.

మోడీ బీసీగా ఉండి, పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. కుల గణన చేయడం వలన పంచాయతీ ఎన్నికల్లో అధిక మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నదన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణలోనే మొదటిగా కుల గణన చేసి, రికార్డు సృష్టించాలన్నారు. పార్టీలోని బీసీ నేతలంతా కుల గణనకు పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీసీ బిడ్డలకు న్యాయం జరగాలంటే ఇదే మంచి మార్గమని వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తానని, రాహుల్ గాంధీ పీఎం కావాలనేది తన కోరిక అని స్పష్టం చేశారు.


Similar News