TG Secretariat: చీరలు సెలక్ట్ చేసిన మంత్రి సీతక్క.. పంపిణీపై క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల(Telangana Anganwadi Teachers)కు, ఆయాలకు కొత్త చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-12 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల(Telangana Anganwadi Teachers)కు, ఆయాలకు కొత్త చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సచివాలయంలో కొత్త చీరల కలర్‌, డిజైన్‌ల ఎంపికపై అంగన్‌వాడీల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంగన్‌వాడీలకు మంత్రి సీతక్క(Minister Seethakka) చీరలు చూపించి గతంలోనే అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా.. గురువారం తుది చీరలను ఎంపిక చేశారు. సచివాలయంలోని మంత్రి సీతక్క చాంబర్‌లో మంత్రి సీతక్కకు పలు రకాల చీరలను మహిళా శిశు సంక్షేమ శాఖ(Department of Women and Child Welfare) కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, సిబ్బంది చూపించారు.

అనంతరం చీరలకు సంబంధించి అధికారులకు సీతక్క పలు సూచనలు చేసి ఫైనల్ చేశారు. గతంలో ఇచ్చిన చీరలకన్నా నాణ్యమైనవి ఇవ్వాలని, కలర్‌, డిజైన్‌లలో పలు మార్పులు చేయాలని సూచించారు. అందరి అభిప్రాయాల మేరకే కొత్త చీరలు త్వరలోనే పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

Tags:    

Similar News