Seethakka: ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చబోతోంది.. మంత్రి సీతక్క

ఇందిరా మహిళా శక్తి(Indira Mahila Shakthi Scheme) తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను(Telangana Rural Economy) మార్చబోతోందని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు.

Update: 2024-12-04 02:18 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇందిరా మహిళా శక్తి(Indira Mahila Shakthi Scheme) తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను(Telangana Rural Economy) మార్చబోతోందని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం సత్ఫలితాలను ఇవ్వబోతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడపబోతోందని ఓ దిన పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. స్వయం సహాయక సంఘాల ద్వారా 64 లక్షల మంది మహిళలకు సాధికారత కల్పిస్తూ, ఈ చొరవ వ్యవస్థాపకత, ఆర్థిక భద్రత, స్థిరమైన వృద్ధిని పెంచుతుందని స్పష్టం చేశారు. అలాగే ఈ అద్భుతమైన పురోగతికి అందరూ మద్దతు తెలపాలని, దీనిని వేడుకల జరుపుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024 మార్చి 12న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా సదస్సు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలో సభ్యులను 'కోటీశ్వరులు'గా మార్చాలనే తన ప్రభుత్వ విజన్‌ను సీఎం స్పష్టం చేశారు.

Tags:    

Similar News