Seethakka: కిమ్స్ ఆసుపత్రికి మంత్రి సీతక్క.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
నూతన సంవత్సరంలో(New Year) చిన్నారి శ్రీతేజ్(Sri Tej) ఆరోగ్యవంతుడై వస్తారన్న నమ్మకం ఉందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సరంలో(New Year) చిన్నారి శ్రీతేజ్(Sri Tej) ఆరోగ్యవంతుడై వస్తారన్న నమ్మకం ఉందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ(Kanthi Vesli)తో కలిసి కిమ్స్ ఆసుపత్రి(Kims Hospital)ని సందర్శించిన సీతక్క.. సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theatre Incident)లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని చూసి భావోద్వేగానికి లోనైనా మంత్రి.. బాలుడి తండ్రికి ధైర్యం చెప్పారు.
అనంతరం డాక్టర్లతో మాట్లాడి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. అలాగే బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, వెంటిలేటర్ చికిత్స నుంచి బయటకి వచ్చాడని తెలిపారు. అంతేగాక శ్రీతేజ్ కుటుంబానికి మా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఇక శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై స్పెషల్ కేర్ తీసుకొని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను సీతక్క ఆదేశించారు.