SCR: విజయవంతంగా నడిచిన గోల్కొండ ఎక్స్ ప్రెస్.. లోకోపైలట్లకు అధికారుల కీలక సూచన!

Update: 2024-09-04 13:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గోల్కొండ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో హైదరాబాద్, విజయవాడల మధ్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మహాబూబాబాద్ జిల్లాల్లో కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ కోట్టుకుపోయింది. దీంతో వరంగల్ మీదుగా హైదరాబాద్, విజయవాడల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన రైల్వేశాఖ 72 గంటల పాటు శ్రమించి రైల్వే ట్రాక్ ను తిరిగి పునరుద్దరించారు. మరమత్తు పనులు పూర్తి కావడంతో అధికారులు విజయవాడ నుంచి వరంగల్ మీదుగా గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో హైదరాబాద్, విజయవాడల మధ్య పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు అధికారులు పచ్చజెండా ఊపారు. అయితే మరమ్మత్తులు జరిపిన చోట కాస్త వేగం తగ్గించి నడిపించాలని ఆ మార్గంలో వచ్చే లోకోపైలట్లకు సూచించినట్లు తెలిసింది.  


Similar News