TGSRTC : భక్తులకు ఆర్టీసీ శుభవార్త.. కురుమూర్తి జాత‌ర‌కు ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుండంటే?

భక్తులకు టీవీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణలో ప్ర‌సిద్ధ క్షేత్ర‌మైన శ్రీ కురుమూర్తి స్వామి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల సౌక‌ర్యార్థం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను టీజీఎస్ఆర్టీసీ న‌డుపుతోంది.

Update: 2024-11-01 11:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు టీవీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణలో ప్ర‌సిద్ధ క్షేత్ర‌మైన శ్రీ కురుమూర్తి స్వామి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల సౌక‌ర్యార్థం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను టీజీఎస్ఆర్టీసీ న‌డుపుతోంది. జాత‌రలో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ఉద్దాల ఉత్స‌వం ఈ నెల 8వ తేదిన ఉండ‌గా.. 7 నుంచి 9వ తేది వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా రోజుల్లో ప్ర‌త్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోంది.

ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు వెళ్తాయి. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను సంస్థ క‌ల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఉప‌యోగించుకుని సుర‌క్షితంగా కురుమూర్తి స్వామిని ద‌ర్శించుకోవాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం కోరుతోంది. ఈ విషయాలను ఎక్స్ వేదికగా శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

Tags:    

Similar News