Alleti Maheshwar Reddy: 2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త సీఎం: ఏలేటీ మహేశ్వ రెడ్డి

2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త సీఎం వస్తారని ఏలేటీ మహేశ్వ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-01 11:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి (cm Revanth Reddy) కౌంట్ డౌన్ మొదలైందని త్వరలోనే  సీఎం సీటుకు ఎసరు పడబోతున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 7 సార్లు వెళ్లినా ఆయనకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకు తెలంగాణకు కొత్త సీఎం రావచ్చని జోస్యం చెప్పారు. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందని అదే సమయంలో ఆశావహులు కూడా సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్.. కనీసం ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ని కలవాలని కేరళలోని వయనాడ్ కు వెళ్లినా దర్శనభాగ్యం కలగలేదన్నారు.

ఆ విషయం హైకమాండ్ కు తెలిసిపోయింది:
రూ.50 లక్షల కోట్ల మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్ల వ్యయానికి పెంచుతూ మాట్లాడాడని ఇందులో భారీగా స్కామ్ జరగబోతోందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ రేవంత్ ను దూరం పెడుతోందని ఆరోపణలు గుప్పించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి నష్టమని సీఎంను వ్యతిరేకిస్తున్నారని ఈ సంగతి బయటకు చెప్పలేని వాళ్ళు చెవులు కోరుకుతున్నారు.. కొందరు గ్రూపులు కడుతున్నారని అన్నారు. సీఎం ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారని దీన్ని అధిష్టానం కూడా నమ్ముతోందన్నారు. తమకు ఏమీ దొరక్కుండా సీఎం చేస్తున్నారని కొంత మంది ఒక గ్రూపుగా ఏర్పడ్డారని దీనిపై ఢిల్లీలో భేటీ కూడా అయి రేవంత్ ను తొలగించాలని హైకమాండ్ ను కూడా ఒప్పించారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (HYDRA) , మూసీ (MUSI), ల్యాండ్ సెటిల్ మెంట్లపై హైకమాండ్ వద్ద తేల్చుకునేందుకు సీనియర్ మంత్రులు నివేదికలు పంపారని వారంతా ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కాకుండా హైడ్రా, మూసీని రేవంత్ ఎందుకు ముందుకు వేసుకున్నాడని ఆలోచనలో పడ్డారన్నారు.

డీకే ఫోన్ రేవంత్ తియలేదు:

రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎజెండకు గల కారణం ఏంటని పార్టీ కూడా ఆరా తీసిందని దీని ద్వారా పార్టీకి నష్టం.. రేవంత్ కు లాభమని గ్రహించిందన్నారు. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు మూసీ అంశంపై సోనియా గాంధీ (Sinia Gandhi)కి నేరుగా వెళ్లి ఇక్కడి పరిస్థితి వివరించి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారన్నారు. రంగంలోకి దిగిన ఆమె.. డీకే శివకుమార్ (D.K shivakumar) కు చెప్పి రేవంత్ కు ఫోన్ చేసి కనుక్కోమన్నారు.. డీకే శివకుమార్ ఫోన్ రేవంత్ లిఫ్ట్ కూడా చేయలేదన్నారు. దీన్ని ఆయనే స్వయంగా చిట్ చాట్ లో రేవంత్ ఒప్పుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత లాభం కోసం పార్టీని ఇరికిస్తున్నాడని పార్టీ భయపడుతోందని, కేవీపీ రామచంద్రరావు ఇల్లు కూల్చివేత అంశంపై రేవంత్ చిన్న పిల్లాడిలా మాట్లాడారన్నారు. దీనిపై హైకమాండ్ సీరియస్ గా ఉందని కేవీపీ రామచంద్రరావు ఇప్పటికే దీనిపై బహిరంగ లేఖ కూడా రాశారన్నారు. AICC కి వస్తున్న ఫిర్యాదులు, గమనిస్తున్న తీరును చూస్తే రేవంత్ కు ప్రత్యామ్నాయం ఎవరు అని పార్టీ ఆలోచిస్తోందన్నారు. అమెరికాలో ఉన్న భట్టి (Bhatti Vikramarka) రాగానే హై రైజ్ డ్ బిల్డింగ్ లపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను కూడా రేసులో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారన్నారు. సీఎం కోసం రేసులో ఉన్న ముగ్గురు సీనియర్ మంత్రులు పూస గుచ్చినట్టు ఢిల్లీ పెద్దలకు విషయం వివరిస్తున్నారని చెప్పారు. ఇదంతా గ్రహించిన రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy).. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy) సీఎం అవుతారని, తన నాలుకపై మచ్చలున్నాయని చెప్పారన్నారు. ఇదంతా తెలుసుకున్న రేవంత్ రెడ్డి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలని భావిస్తున్నారని, తన పదవి పోతుందనే రేవంత్ కేబినెట్ విస్తరణ కూడా చేయడం లేదన్నారు.మంత్రి పదవుల కోసం రేవంత్ గ్రూపు.. ఆయన వ్యతిరేక గ్రూపు మధ్య పోరు మొదలైందన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు నటిస్తున్నారు:

మూసీ, హైడ్రా విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలుపైకి ఓకే అని నటిస్తున్నారని ఏలేటీ వ్యాఖ్యానించారు. భట్టి ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు.. రేవంత్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నాయని కేబినెట్ మొత్తం వ్యతిరేకిస్తోందని చెప్పేందుకు ఇది నిదర్శనం అన్నారు. మూసీకి రేవంత్ లక్షన్నర కోట్లు ఖర్చు అవుతుందని అంటే భట్టి.. DPR లేకుండా ప్రతిపక్షాలు ఎలా విమర్శలు చేస్తాయని అంటున్నారని గుర్తు చేశారు. పేదలకు ఇండ్ల విషయంలో కూడా భట్టి సీఎం నిర్ణయాన్ని స్పష్టంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మూసీ పరివాహక రైతులతో శుభం కన్వెన్షన్ లో మీటింగ్ పెడితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హాజరుకాలేదన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందని బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామని రేవంత్ హైకమాండ్ ను ఒప్పించారని అయితే రేవంత్ రెడ్డిని నమ్ముకుని పార్టీ రాజ్యాంగమైన పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకుందన్నారు. తీరా చూస్తే.. 11 మంది కూడా రాకపోగ ఉన్నవాళ్లు తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైకమాండ్ కూడా ఓటుకు నోటు కేసు కోసం ఎదురు చూస్తోందా? అన్నట్లు పరిస్థితి మారిందన్నారు. నల్లగొండలో ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మంలో భట్టి పేర్లు సీఎంలుగా ఆయా జిల్లాల్లో వినిపిస్తున్నాయని, దామోదర రాజనర్సింహ (Damodara rajanarsimha) మంత్రి పదవిని తొలగించి సీఎం వద్ద పెట్టుకోవాలని రేవంత్ ప్లాన్ చేశారని ఆరోపించారు.

Tags:    

Similar News