జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తుండు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)పై అటు అధికార పార్టీలోనూ.. ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోన్న వేళ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)పై అటు అధికార పార్టీలోనూ.. ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోన్న వేళ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ (Delhi) స్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. ఈ విషయంలో ధర్మరాజుల ఉండాల్సిన సొంత జిల్లా నేత జానారెడ్డి (Janareddy) ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాదాని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.