ఒక్కో యూనిఫాంకు రూ.50.. స్వయం సహాయక బృందాలను గుర్తింపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 26,79,497 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 26,79,497 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం అందించనుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ లోకల్‌బాడీ, కేజీబీవీ, అర్బన్రెసిడెన్షియల్స్కూళ్లు, మోడల్‌స్కూళ్లు, గురుకులాలు, ప్రైమరీ, ఎయిడెడ్పాఠశాలలకు చెందిన ఒకటో తరగతి నుంచి ఇంటర్‌వరకు విద్యార్థులకు యూనిఫాంలు అందించనున్నారు. దానికి కావాల్సిన వస్త్రాలను టీఎస్సీవో అందించనుంది. కాగా యూనిఫాంలు కుట్టేందుకు స్వయం సహాయక బృందాలను గుర్తించాలని పాఠశాల విద్య డైరెక్టర్దేవసేన సోమవారం సర్క్యులర్జారీ చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, సమగ్ర శిక్షణ చైర్ పర్సన్లు వెంటనే స్వయం సహాయక బృందాలను గుర్తించాలని ఆదేశించారు. బెస్ట్స్వయం సహాయక బృందాలను గుర్తించాలని, దీని వల్ల వారికి కూడా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కాగా ఒక్కో యూనిఫాం కుట్టేందుకు రూ.50 అందించనున్నట్లు స్పష్టం చేశారు.