సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం పేద పిల్లలకు వరం: మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేసిన దాని వెనుక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేసిన దాని వెనుక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం రావిర్యాలలోని జెడ్పీ హై స్కూల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం పేద పిల్లలకు వరమని అన్నారు. ఈ స్కీమ్‌తో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయన్నారు. అంతేకాకుండా విద్యార్థులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.