TG: తెలంగాణ రైతులకు సర్కార్ న్యూఇయర్ కానుక
తెలంగాణ రైతుల(Telangana Farmers)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) శుభవార్త చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతుల(Telangana Farmers)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) శుభవార్త చెప్పారు. ఆయిల్ పామ్(Oil Palm Crop) గెలల ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్ను పామాయిల్ గెలల ధర రూ. 20,506గా నిర్ణయించినట్లు మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. జనవరి 1 నుంచే పెరిగిన ధరలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు.. రైతు భరోసా మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలో రూ. 21 వేల కోట్ల రుణామాఫీ, రూ.7,625 వేల కోట్ల రైతుబంధు, రూ.3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చిందని ప్రకటించారు. సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చామని స్పష్టం చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చించడం మాత్రమే చేశామన్నారు. చర్చల ఫలితాలను కేబినెట్‌లో పెడతామని అన్నారు. కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.