ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వైద్య సంఘాలతో హెల్త్ మినిస్టర్ చెప్పినట్లు సమాచారం. సోమవారం వైద్యారోగ్యశాఖలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం వైద్యసంఘాలు హెల్త్ మినిస్టర్‌తో భేటీ అయ్యాయి. దాదాపు గంట సేపు చర్చించాయి. పేషెంట్‌ను ఎలుక కొరికిన ఘటనలో కామారెడ్డిలో వైద్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డాక్టర్లు కోరారు.
టీవీవీపీని డైరెక్టరేట్ పరిధిలోకి తీసువచ్చి ట్రెజరీ సాలరీలు ఇవ్వాలని, 33 మెడికల్ కాలేజీల్లోని సమస్యలపై, జనరల్ ట్రాన్స్ ఫర్స్, డీఎంఈ పరిధిలో ప్రొఫెసర్‌ల వయోపరిమితి అంశాలపై చర్చించినట్లు డాక్టర్లు తెలిపారు. వీటన్నింటిని అతి త్వరలోనే పరిష్కరిస్తారని మంత్రి చెప్పినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ రవూఫ్, డాక్టర్ వినయ్ తదితరులు ఉన్నారు.