రంజాన్ మాసంలో మరో వివాదంలో చిక్కుకున్న సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2024-04-04 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నిర్వహించిన ఒక ఎక్స్ పో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ పోకు సానియా తన చెల్లెలు అనం మీర్జాతో కలిసి దావత్ ఎ రంజాన్‌కు హాజరయ్యారు. సానియాతో పాటు ఈ ఎక్స్ పోకు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ హాజరయ్యారు. అయితే దీనిపై ముస్లింలు మండిపడుతున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో సినిమా వ్యక్తులను పిలవడం ఏంటని వారు ఫైర్ అవుతున్నారు. అయితే మరో ఎక్స్ పోకి మునావర్ ఫారుఖీ హాజరయ్యారు. ఎక్స్ పోకు వీరు రావడం పట్ల ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రంజాన్ మాసాన్ని పవిత్రంగా ఉంచాల్సింది పోయి ఈ సీజన్ ను డబ్బు సంపాదనకు వేదికగా మారుస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే మెహిఫిల్ ఎ ఖైజా ఎక్స్ పోలో మునావర్ ఫారుఖీ చీఫ్ గెస్ట్‌గా పాల్గొనడం పట్ల సైతం ముస్లింలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో మునావర్ ఫారుఖీ షోకి రావడంతోనే బీజేపీ నేత మహమ్మద్ ప్రవక్త పట్ల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ లో శాంతి భద్రతలకు తీవ్ర ఆటంకం కలిగిందని ముస్లిం పెద్దలు అంటున్నారు. సానియా మీర్జా ఇలాంటి తప్పులు మరో సారి చేయొద్దని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఇదే అంశంపై ముస్లిం స్కాలర్ ఇలియాజ్ శంసీ మాట్లాడుతూ.. సానియా మీర్జా ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. 6-8 నెలల క్రితమే వాళ్లింట్లో విడాకుల ఘటన కూడా చూశామని.. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఇలా వ్యవహరించడం చాలా దారుణమన్నారు. తాను సానియా మంచి కోరకుంటున్నా అని.. అయితే గతంలోనూ సానియా ఇలా వ్యవహరించారని గుర్తు చేశారు. వ్యాపారాలు చేసుకోండి కానీ.. రవీనా టాండన్ లాంటి హీరోయిన్లను తీసుకొచ్చి రంజాన్ పవిత్రతను దెబ్బతీయొద్దంటూ హెచ్చరించారు.

మరో ముస్లిం స్కాలర్ మహ్మద్ సలీం మాట్లాడుతూ.. మునావర్ ఫరూఖీ దేవతలను కించపర్చేలా వ్యవహరిస్తుంటాడని.. గతంలోనూ బీజేపీ నేతలు విమర్శించారు. హైదరాబాద్ లో యాక్షన్, రియాక్షన్ రెండూ జరిగాయన్నారు. మునావర్ వల్ల ముస్లింలకు చాలా తీవ్ర ఇబ్బందులు కలిగాయన్నారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని గుర్తు చేశారు. మునావర్ ను హైదరాబాద్ కు పిలిపించిన వ్యక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.


Similar News