Shamshabad Airport : ఒకే కారుకు రెండు నంబర్లు.. ఏపీ కారుకు టీజీ బోర్డు.. వీడియో వైరల్

ఇతర రాష్ట్రాల వాహనాలను చట్టవిరుద్దంగా తెలంగాణ టాక్సీ ప్లేట్‌గా మార్చి నడుపుతున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-08-04 07:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇతర రాష్ట్రాల వాహనాలను చట్టవిరుద్దంగా తెలంగాణ టాక్సీ ప్లేట్‌గా మార్చి నడుపుతున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే కారుకు రెండు నంబర్లు కలిగిన వాహనానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన వాహనానికి టీజీ బోర్డును అమర్చిన ఓ కారును శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్స్ గుర్తించారు.

ఇతర రాష్ట్రల నుంచి వస్తున్న వందలాది క్యాబ్‌లు, ట్యాక్సీలతో తమ ఉపాధి కోల్పోతున్నామని ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు ఎయిర్‌పోర్టులో తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, అయితే చాలా మంది డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇలా చట్టవిరుద్ధంగా వాహన నంబర్ ప్లేట్లను మార్చుతూ యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News