INS-SS ప్రవేశపరీక్షలో మెరిసిన కండక్టర్ కూతురు.. సజ్జనార్ ప్రత్యేక ట్వీట్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ (ఐఎన్ఎస్-ఎస్ఎస్) ప్రవేశ పరీక్షలో కండక్టర్ పి.మహాలింగం కూతురు మౌనిక సత్తా చాటారు.

Update: 2024-06-20 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ (ఐఎన్ఎస్-ఎస్ఎస్) ప్రవేశ పరీక్షలో కండక్టర్ పి.మహాలింగం కూతురు మౌనిక సత్తా చాటారు. కాగా, ఆమెను ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసించారు. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన ఈ పరీక్షలో అంకాలజీ విభాగంలో ఆమె జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. పట్టుదల, ఏకాగ్రతతో చదివి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మౌనికకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్వీట్ చేశారు.   


Similar News