హెచ్ఆర్ఏ సవరణపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్.. ఏం చెప్పారంటే?

గత ప్రభుత్వం 2017 లో 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించగా.. తాజాగా 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది.

Update: 2024-03-19 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వం 2017 లో 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించగా.. తాజాగా 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఈ నెల 15న ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్‌లో హెచ్ఆర్ఏ తగ్గించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్ఆర్ఏ‌ సవరణపై క్లారిటీ ఇచ్చారు. జీవో నంబర్‌ 53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరణ చేయాలని 2020లో యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. అప్పడు ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజన్‌ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను తాత్కాలికంగా సంస్థ నిలుపుదల చేసిందని అన్నారు. తాజాగా 2017 పే స్కేల్‌ ను రివిజన్‌ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను యాజమాన్యం సవరించింది. హెచ్‌ఆర్‌ఏ సవరణపై జరుగుతున్న అసత్య ప్రచారం నేపథ్యంలో వివరణ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 

Tags:    

Similar News