విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్: బల్మూరి వెంకట్
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారని ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారని ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. అక్రమంగా గురునానక్, శ్రీ నిధి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగాయన్నారు. దీంతో సుమారు 5 వేల మంది విద్యార్ధులను నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అండదండలతోనే యాజమాన్యాలు గేమ్ ఆడుతున్నాయని స్పష్టం చేశారు. ఈ రెండు విద్యాసంస్థల అవినీతిపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వెంకట్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి వెంకట్‌ను గోషా మహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా.. గురునానక్, శ్రీ నిధి కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా అడ్మిషన్లు, ఫీజులు ఎలా వసూల్ చేస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వ అండదండలతోనే ప్రైవేట్ యాజమాన్యాల దౌర్జన్యం ఎక్కువైనట్లు మండిపడ్డారు.