గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి.. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కె.రాజిరెడ్డి
ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కె.రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కె.రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మూడున్నర సంవత్సరాలుగా కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం లేదని, రాజ్యాంగం కల్పించిన కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించడం లేదని తెలిపారు. గుర్తింపు సంఘం కమిటీల స్థానంలో ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు 3 నెలలలోపు పెట్టాలని రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ లో ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. గడువు 3 నెలలు పూర్తైనప్పటికీ ఆర్టీసీలోగుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడానికి కార్మికశాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్నిఅయన తీవ్రంగా ఖండించారు.
2019లో నిలిపివేసిన గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే పెట్టాలని డిమాండ్ చేసారు ఆర్టీసిలో ఎంప్లాయీ వెల్ఫేర్ బోర్డులు రద్దు చేసి,కార్మిక సంఘ కార్యకలాపాలను అనుమతించే విధంగా లేబర్ కమీషనర్ గారు ఆర్టీసి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసిలో రోజు రోజుకు రిటైర్, వీఆర్ఎస్, మెడికల్ గ్రౌండ్ లో కార్మికులు తగ్గిపోతుంటే కొత్త నియామకాలు చేపట్టకుండ ఉన్న కార్మికులపైన విపరీతమైన పనిభారాలను పెంచుతున్నారు. 8 గంటల పని స్థానంలో 12 నుండి 16 గంటలు పనిచేయిస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీలో దేశంలోను రాష్ట్రంలోను అమలులో ఉన్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ఆర్టీసి కార్మికలతోటి వెట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు.
మోటారు ట్రాన్స్ పోర్టు వర్కర్స్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అమలు చేయడం లేదన్నారు. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, టెర్మినల్ బెనిఫిట్స్ కూడా సకాలంలో చెల్లించడం లేదన్నారు. ధర్నా అనంతరం లేబర్ కమిషనర్ అహ్మద్ నదీమ్ వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, జీఆర్ రెడ్డి , డి.గోపాల్ , జక్రయ్య, జ్యోతి, పాపయ్య గౌడ్, బాపురెడ్డి జయ, ప్రకాష్, రాములు, వినాయక రెడ్డి, శ్రీనివాస్, కిషన్ గౌడ్ శరణప్ప,శారద, కల్పన, శమంత, కెఆర్ .రెడ్డి ఏఎస్.రెడ్డి, టిఎస్.రెడ్డి పాల్గొన్నారు.